
● బద్వేలులో..
బద్వేలు అర్బన్: స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట బద్వేలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఓ ఉదయభారతికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షుడు భూమిరెడ్డి వెంకటేష్, నియోజకవర్గ నాయకులు పి.సుదర్శన్‌రెడ్డి, జె.జానీసుందరం, జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు ఎ.వెంకటేష్, మోహన్‌క్రిష్ణ, రాజన్న, శేఖర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, వి.వి.రమణ, అరుణ్, సీపీఐ పట్టణ కార్యదర్శి బాలు, సీపీఎం నాయకులు చిన్ని, సీపీఐఎంఎల్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.