
ప్రైవేటు స్కూళ్లకు దసరా సెలవులు ఇవ్వాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించినప్పటికి ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ పేర్కొన్నారు. అలాంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం నగరంలోని ఆర్జేడీ కార్యాలయం ఏఓ విజయ్‌కుమార్‌కు డీవైఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల టీచర్లు దసరా సెలవుల్లో స్కూలుకు రాకుంటే ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి విజయ్ పాల్గొన్నారు.
హిట్ అండ్ రన్ కేసుల్లో
పరిహారం చెల్లింపుపై సమీక్ష
కడప అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని సూచనల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో కడపలోని జిల్లా కోర్టు ఆవరణంలో బుధవారం న్యాయసేవా సదన్‌లో ‘హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారం చెల్లింపు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట డివిజన్ అడిషనల్ ఎస్పీ, కడప డీఎస్పీ, కడప, రాయచోటి రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.
కమ్యూనిటీ సైన్సు కోర్సుల్లో
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కడప అగ్రికల్చర్ : ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ‘కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్‘ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేవీకే కో ఆర్డినేటర్ అంకయ్యకుమార్, కేవీకే శాస్త్రవేత్త ప్రశాంతి తెలిపారు. ఠీఠీఠీ. ్చుఽజట్చఠ. ్చఛి. జీుఽ వెబ్‌సైట్‌లో దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 30 వరకు గడువు ఉందన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ప్రైవేటు స్కూళ్లకు దసరా సెలవులు ఇవ్వాలి