
మంత్రి లోకేష్ క్షమాపణ చెప్పాలి
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి లోకేష్ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్. శివరామ్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహనం కోల్పోయి మాట్లాడిన తీరు అభ్యంతరకరమన్నారు. మంత్రి లోకేష్ తన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటికరణ విషయంలోనూ బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ చేసిన వ్యాఖ్యలు ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కె. శివ యాదవ్, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ఎస్. బాదుల్లా, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి నరసయ్య, వైఎస్సార్‌సీపీ నగర కార్యదర్శి క్రిష్ణ, సుబ్బరాయుడు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం
జిల్లా అధ్యక్షుడు శివరామ్