మరో ఆరు రోజుల్లో ఖరీప్ ముగిసి రబీ సీజన్ ప్రారంభం
ఇంతవరకు సాగు వివరాలు, ఎరువులు కేటాయించని ప్రభుత్వం
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రీవెన్స్ సెల్ ‘స్పందన’ పేరు తొలగించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)గా మార్పు చేసింది. పేరు మార్పుపై ఉన్న శ్రద్ధ అర్జీల పరిష్కారంపై మాత్రం కనిపించడం లేదు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ ద్వారా ఇప్పటివరకు మొత్తం 88 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 37,829 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 3996 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫిర్యాదుల్లో అత్యధికభాగం రెవెన్యూ, పోలీసు, సర్వే సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, పాఠశాల విద్య, ఎస్‌పీడీసీఎల్, హౌసింగ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రూరల్ డెవలప్‌మెంట్, పౌరసరఫరాలు, ఆర్‌అండ్‌బీ వంటి శాఖల నుంచి వస్తున్నాయి.
రెవెన్యూలో అత్యధికం
పీజీఆర్‌ఎస్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల్లో రెవెన్యూశాఖ నుంచే అత్యధికంగా ఉన్నాయని, అందులో ఆర్వో ఆర్‌కు సంబంధించినవే ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొనడం గమనార్హం. ఫిర్యాదుల పరిష్కారంలో ఆడిట్ కూడా నిర్వహిస్తున్నామని చెప్పినప్పటికీ దాని ఫలితాలు ఎక్కడా కనిపించలేదు. రెవెన్యూశాఖను పీపుల్స్ ఫ్రెండ్లీగా మారుస్తామని ప్రకటనలు గుప్పించడం మినహా ఆచరణలో చేస్తున్నది మాత్రం శూన్యం. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీల పరిష్కారమే ఇందుకు నిదర్శనం. రెవెన్యూశాఖలో ఇప్పటివరకు మొత్తం 14,289 అర్జీలు వచ్చాయి.
ఇందులో 2,196 పరిష్కారానికి నోచుకోలేదు. అలాగే సర్వే సెటిల్‌మెంట్ అండ్‌ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో 7170 అర్జీలు వచ్చాయి. పోలీసుశాఖకు సంబంధించి 7718 ఫిర్యాదులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో 2210 అర్జీలు వచ్చాయి. ఇలా ఆయా శాఖల్లో పలు అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రీ ఓపెన్ అవుతున్నవి కూడా అధికమే. కూటమి ప్రభుత్వం ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
కడప అగ్రికల్చర్ : కూటమి ప్రభుత్వానికి రైతులంటే గిట్టదని.. వ్యవసాయమంటే చిన్నచూపని మరోసారి రుజువైంది. ఇప్పటికే పంటకు మద్దతు ధర దక్కక.. సాగుకు యూరిక దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. అవన్నీ దిగమింగుకుని రబీకి సిద్ధమవుతున్న రైతన్నకు ..ప్రభుత్వం నుంచి మద్దతు కరువైంది. సాగు వివరాలు.. ఎరువుల కేటాయింపు వంటి ప్రణాళిక సిద్ధం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మరో ఆరు రోజుల్లో ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభంకానుంది. వ్యవసాయశాఖ ఇంత వరకు రబీ సీజన్‌కు సంబంధించిన సాగు ప్లానింగ్ సిద్ధం చేయలేదు. విత్తనాలను కేటాయించినా వాటి సబ్సిడీ, విత్తనాల ధరలను ఇంతవరకు పేర్కొనలేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో కురుస్తున్న వర్షాలు...
జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకే రబీ సీజన్‌కు సంబంధించి కొంతమంది రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకునే అవకాశం ఉంది. ఆరుతడి పంటలసాగుకు ముందు చాలా మంది రైతులు సత్తువ పంట వేస్తారు. కానీ జిల్లాలో ఎరువులు సరిగా దొరకడం లేదని రైతన్నలు వాపోతున్నారు. ముఖ్యంగా రబీలో అధిక విస్తీర్ణంలో జిల్లాలో శనగపంట సాగవుతుంది. దీంతోపాటు వేరుశనగ, మినుము, పెసర, నువ్వు వంటి పంటలను కూడా అధిక విస్తీర్ణంలోనే సాగు చేస్తారు. ముఖ్యంగా రబీ సీజన్ ప్రారంభంలో జిల్లా రైతులు శనగ సాగు చేస్తారు. ప్రభుత్వం ఇంతవరకు శనగ విత్తనాలకు సంబంధించిన ధరలను కానీ, ఎంత శాతం మేర సబ్సిడీ అనే విషయాలను కేటాయించలేదు. మరి విత్తనాల కోసం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అధికారులు విత్తనాలను ఎప్పుడు రైతు సేవా కేంద్రాలకు పంపిస్తారని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. హడావుడిగా విత్తనాల పంపిణీ చేపడితే ఆ విత్తనాలు ఎలాగుంటాయోనని రైతుల్లో ఆందోళన మొదలైంది. గతేడాది చాలా మేర శనగ విత్తనాలు సరిగా లేవని రైతులు పెదవి విరిచారు.
212.3 మి.మీ వర్షపాతం...
రబీ సాగుకు అక్టోబర్ కీలకం. రబీ మూడు నెలలకాలంలో 212.3 మిల్లిమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా అందులో అక్టోబర్ నెలలో అత్యధికంగా 132.1 మిల్లీమీటర్లు కురవాలి. ఇక నవంబర్ నెలలో 61.6 మి.మీ, డిసెంబర్ నెలలో 18.6 మి.మీ కురవాల్సి ఉంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు శనగపంట సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అక్టోబర్ తొలి వారంలోనే ముందస్తుగా శనగపంటను విత్తుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ సారి ఖరీఫ్‌సాగు చేయలేని రైతులు రబీలో శనగ సాగు చేయనున్నారు. కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అక్టోబర్‌లోనే అధి క విస్తీర్ణంలో పంటలు సాగయ్యేవి. ఆ నెల తొలి వారంలోనే 40 శాతం సబ్సిడీతో శనగవిత్తనాలు అందే విష యాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. విత్తనాల పంపిణీని త్వరితగతిన ప్రారంభించేందుకు సన్నాహాలు చేయా లని రైతులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రోడ్డున పడ్డాం ఆదుకోండి శనగ విత్తనాలను ఎప్పుడిస్తారో...
ప్రస్తుతం జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఈ పదునుకు మేమంతా ఎరువులను విత్తుకుంటాం. అక్టోబర్ 2 లేదా మూడవ వారం నుంచి శనగ పంటను సాగుచేస్తాం. నేను కూడా 12 ఎకరాల్లో శనగపంటను సాగు చేయనున్నా. ప్రభుత్వం ఇంతవరకు సబ్సిడీ, విత్తనాలను గురించే మా ట్లాడటం లేదు. మరి సబ్సిడీ శనగ విత్తనాలను ఎప్పుడి నుంచి ఇస్తారో.
– శెట్టిపల్లి పవన్‌కుమార్‌రెడ్డి, పెద్దపసుపుల, పెద్దముడియం మండలం.
నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలి
ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే విత్తనాలను నాణ్యతతో కూడిన వి ఇవ్వాలి. గతేడాది రైతులకు ఇచ్చిన శనగ విత్తనాల్లో అక్కడక్కడ నాణ్యత సరిగా లేదు. దీంతో చాలా మంది రైతులు బయట నుంచి కొనుగోలు చేసి విత్తుకున్నారు. ఈ ఏడాది అలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. – ఇరగంరెడ్డి చిన్న గంగిరెడ్డి, సోమపురం, రాజుపాలెం మండలం
రైతులకు ఆందోళన అవసరం లేదు
జిల్లాకు సబ్సిడీకి సంబంధించి శనగ, వేరుశనగ, ను వ్వులు, మినుములు, పెస ల విత్తనాలైతే వచ్చాయి. కానీ వాటి ధరలుకానీ, ఎంత సబ్సిడీ అనే విషయాలపై స్పష్టత లేదు. దీంతోపాటు రబీ సాగు ప్లానింగ్, ఎరువులు కూడా రాలేదు. త్వరలో అవికూడా వస్తాయి. రైతులు ఎవరు ఆందోళన చెందనవరం లేదు.
– చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి
గత ప్రభుత్వంలో విశేష ‘స్పందన’
కూటమి ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం కాగితాలకే పరిమితం అవుతోంది తప్ప క్షేత్ర స్థాయిలో సమస్యలు అలాగే ఉన్నాయి. పారదర్శకంగా విచారణ జరిపి సంతృప్తకర స్థాయిలో పరిష్కారాలు లభించలేదు. దీంతో వచ్చిన వారే మళ్లీమళ్లీ వస్తూ అర్జీలు సమర్పించుకోవాల్సి వస్తోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్పందన పేరుతో అర్జీల స్వీకరణ, పరిష్కారం కూడా జరిగేది. ఈ కార్యక్రమానికి నాటి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజలు సమర్పించే అర్జీలు మరింత నాణ్యంగా, వేగంగా పరిష్కారం కావాలన్న ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షించిందంటే అర్జీల పరిష్కారానికి గత ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో అర్థమవుతుంది.