ప్రజల భద్రతకు ’విజిబుల్‌ పోలీసింగ్‌’ | - | Sakshi
Sakshi News home page

ప్రజల భద్రతకు ’విజిబుల్‌ పోలీసింగ్‌’

Sep 25 2025 7:17 AM | Updated on Sep 25 2025 7:17 AM

ప్రజల భద్రతకు ’విజిబుల్‌ పోలీసింగ్‌’

ప్రజల భద్రతకు ’విజిబుల్‌ పోలీసింగ్‌’

కడప అర్బన్‌ : జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఆదేశాల మేరకు పోలీసులు ’విజిబుల్‌ పోలీసింగ్‌’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ, నేరాలను నియంత్రించడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు.

● అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా నిషేధిత వస్తువులు, గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

● ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.

● రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారు.

● సెల్‌ ఫోన్‌ డ్రైవింగ్‌, డ్రంకెన్‌ డ్రైవింగ్‌ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అలాగే, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కూడా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.

● విజిబుల్‌ పోలీసింగ్‌ ద్వారా పోలీసులు ప్రజల మధ్య ఉంటూ వారికి రక్షణ కల్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement