
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
మైదుకూరు : నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి చంద్ర నాయక్ హెచ్చరించారు. బుధవారం ఆయన మైదుకూరులోని సిండికేట్ రైతు సేవా సహకార సంఘం కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల రిజిస్టర్లను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు ఎరువులను కొనుగోలు చేశాక తప్పనిసరిగా వారికి బిల్లులు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మైదుకూరు ఏడీఏ కృష్ణమూర్తి, ఏఓ బాల గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు.
గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం
మండలంలోని శివపురం, డయాంఖాన్ పల్లె గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి బాల గంగాధర్ రెడ్డి రైతులు సాగు చేసిన ప్రతి పంటను తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని ఏఓ సూచించారు. ఈనెల 30వ తేదీ లోపు పంట నమోదు చేసుకోవచ్చన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి చంద్ర నాయక్