
జాగ్రత్తలను పాటించాలి..
ఈ వ్యాధి దోమకాటుతో వ్యాప్తి చెందుతుంది. కనుక గొర్రెల కాపర్లు సాయంత్రం వేళ 6 నుంచి 7 గంటలలోపే దోమలు కుట్టకుండా వేపాకు లేదా యూకలిప్టస్ ఆకు లేదా కలబందను కాల్చి మంద చుట్టూ వేయాలి. ఈ పొగకు దోమలు దూరంగా పారిపోతాయి. ముఖ్యంగా వ్యాధి సొకిన గొర్రెను మంద నుంచి వేరుచేయాలి. ఎందుకంటే దానిని కుట్టిన దోమ ఆరోగ్యంగా ఉన్న గెర్రెను కుడితే దానికి కూడా వ్యాధి సోకుతుంది. గొర్రెలు, మేకల షెడ్లలో కీటకాలను చంపేందుకు ముందులు పిచికారి చేసుకుంటే వ్యాధి సోకకుండా ఉంటుంది.
– డాక్టర్ రాంబాబు, పశువైద్యాధికారి, కడప