కల్యాణ మూర్తులకు మహా సంప్రోక్షణ | - | Sakshi
Sakshi News home page

కల్యాణ మూర్తులకు మహా సంప్రోక్షణ

Aug 5 2025 6:26 AM | Updated on Aug 5 2025 6:26 AM

కల్యా

కల్యాణ మూర్తులకు మహా సంప్రోక్షణ

బ్రహ్మంగారిమఠం : శ్రీ మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి వారి మాస కల్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం నూతన కల్యాణ విగ్రహ మూర్తులకు మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలు గోపూజ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకు స్వామి వారికి ఏటా జయంతి వేడుకలు, మహాశివరాత్రి సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించే వారు. భక్తులు, దాతల విన్నపం మేరకు ప్రతి నెలా మాస కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఫిట్‌ పర్సన్‌ సి.శంకర్‌బాలాజి, మేనేజర్‌ ఈశ్వరయ్య, బెంగళూరుకు చెందిన గౌరీ శంకరాచారి, పద్మావతమ్మ దంపతులు, రవికుమార్‌, ఆయన సతీమణి నలినాక్షి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

రేపు మాతా గోవిందమ్మ,

వీరబ్రహ్మేంద్ర స్వామి మాస కల్యాణం

కాలజ్ఞాన ప్రబోధ కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబల మాస కల్యాణ మహోత్సవం బ్రహ్మంగారిమఠంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు స్థానిక మఠంలో ఉన్న దివంగత మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు ఫిట్‌ పర్సన్‌ శంకర్‌ బాలాజీ తెలిపారు. కల్యాణంలో పాల్గొనదలచిన భార్యాభర్తలు సంప్రదాయ దుస్తుల్లో రావాలన్నారు. కల్యాణం శాశ్వత దాతలుగా లక్ష రూపాయలు విరాళం ఇచ్చి చేరేందుకు అవకాశం ఉందన్నారు.

కోర్టు ఉత్తర్వుల మేరకు తీర్మానాలను ఆమోదించండి

కడప కార్పొరేషన్‌ : రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జూన్‌ 20వ తేదీ నగరపాలక సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలను ఆమోదించి అమలు పరచాలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కోరారు. సోమవారం కార్పొరేటర్లు శివకోటిరెడ్డి, అజ్మతుల్లా, డివిజన్‌ ఇన్‌చార్జులు ఐస్‌క్రీం రవి, సుబ్బరాయుడు, బసవరాజులు అదనపు కమిషనర్‌ రాకేష్‌ చంద్రకు మేయర్‌ రాసిన లేఖను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జూన్‌ 20వ తేదీ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మెజార్టీ కార్పొరేటర్లు తీర్మానించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని జూలై 24న హైకోర్టు ఉత్తర్వులిచ్చిందన్నారు. ఈ మేరకు ఆ అంశాలన్నింటినీ నగరపాలక సంస్థ మినిట్స్‌ బుక్‌లో రాసి వాటి అమలుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో

గాయపడిన వ్యక్తి మృతి

రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్‌) : రామాపురం మండలం కసిరెడ్డిగారిపల్లి పంచాయతీ దళితవాడకు సమీపంలో ఈ నెల 3వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆగి ఉన్న కారును బైకు ఢీకొన్న ఘటనలో బోనంశెట్టి రవీంద్రకు తీవ్ర గాయాలైన విషయం విదితమే. ఆయన కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు రామాపురం పోలీసులు తెలిపారు.

కల్యాణ మూర్తులకు మహా సంప్రోక్షణ
1
1/1

కల్యాణ మూర్తులకు మహా సంప్రోక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement