● ముమ్మరంగా ఎన్నికల ప్రచారం
● మద్దతు తెలుపుతున్న ప్రజలు
పులివెందుల: పులివెందుల మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రచారం జోరందుకుంది. ఆ పార్టీ నాయకులు గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం పులివెందుల మండల పరిధిలోని ఆర్.తుమ్మలపల్లె, రాయలాపురం, రచ్చుమర్రిపల్లె గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామసుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తదితరులు ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రచారానికి వెళ్లిన నాయకులకు.. అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ, బాణా సంచా పేల్చుతూ సంబరాలు జరుపుకొన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఆర్.తుమ్మలపల్లె గ్రామ పంచాయతీలోని మూడు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా తమ ఊరు, ప్రాంతం అభివృద్ధి చెందిందంటే.. అది వైఎస్ కుటుంబ చలువేనని చెప్పుకొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. గత 40 ఏళ్ల నుంచి తమ గ్రామాలకు మేలు చేస్తున్న వైఎస్ కుటుంబానికే అండగా ఉంటామన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఏ పథకం అమలు చేయలేదని వైఎస్సార్‌సీపీ నాయకులకు ప్రజలు తెలుపుతున్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు అన్నారు కానీ, ఇప్పటి వరకు సిలిండర్ డబ్బులు తమ అకౌంట్‌లో జమ కాలేదన్నారు. తల్లికి వందనం ఇంట్లో ఉన్న అందరి పిల్లలకు అన్నారని, అనేక కొర్రీలు పెట్టి ఇవ్వలేదన్నారు. మహిళలకు ఏడాదికి రూ.18 వేలు అన్నారని, ఆ పథకం కూడా అమలు చేయలేదని వాపోయారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజలు అన్ని గమనిస్తున్నారని వారే చంద్రబాబుకు తగిన విధంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక చంద్రబాబు మోసానికి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజాయితీకి జరుగుతున్న ఎన్నికలు అని తెలిపారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతోందని, ప్రజలు వారి చర్యలను గమనించి వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయాలని కోరారు.
ఉప పోరు.. ప్రచార జోరు
ఉప పోరు.. ప్రచార జోరు
ఉప పోరు.. ప్రచార జోరు
ఉప పోరు.. ప్రచార జోరు