పులివెందులలో భయోత్పాతం! | - | Sakshi
Sakshi News home page

పులివెందులలో భయోత్పాతం!

Aug 6 2025 6:46 AM | Updated on Aug 6 2025 6:46 AM

పులివ

పులివెందులలో భయోత్పాతం!

వ్యవస్థలు నిర్వీర్యం

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. నిర్జీవంగా చేష్టలుగి కూర్చుండిపోయాయి. చిన్న జెడ్పీటీసీ ఎన్నికల కోసం కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా అడ్డుకునే సాహసం చేయ డం లేదు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు తలెత్తితే, ఎన్నికలు సమీపించేకొద్దీ మరెన్ని దుర్వార్తలు వినాల్సి వస్తోందోనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఏకపక్ష చర్యలు వీడి.. ఇకనైనా ప్రజాస్వామ్యబద్ధం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధం కావాలని పలువురు కోరుతున్నారు.

సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భయోత్పాతం సృష్టిస్తోంది. ప్రజామద్దతుతో నెగ్గలేమనే అంచనాకు వచ్చిన టీడీపీ.. పరువు కాపాడుకునేందుకు అఽధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు మొదలు.. అనేక అక్రమాలకు పాల్పడుతోంది. మంగళవారం సాయంత్రం శ్రీకర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్‌సీపీ నేతలపై నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి అనుచురులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. తొండూరు మండలం సైదాపురం సురేష్‌రెడ్డి (చంటి), అమరేష్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని మారణాయుధాలతో దాడి చేశారు. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలో ఉన్న శ్రీకర్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద వివాహం కోసం వేచియున్న సురేష్‌రెడ్డి, అమరేష్‌రెడ్డి, శ్రీకాంత్‌, నాగేష్‌, తన్మోహన్‌రెడ్డిలపై సుమారు 30 మంది టీడీపీ వర్గీయులు ఒక్కమారుగా దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల్ని చుట్టుముట్టి మారణాయుధాలతో విచక్షణా రహితంగా కొట్టారు. అమరేష్‌రెడ్డి తలకు బలమైన గాయాలు కాగా, సురేష్‌రెడ్డి తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. చేయి ఫ్యాక్షర్‌ అయ్యింది. అడ్డువచ్చిన ముగ్గుర్ని కూడా వదలకుండా దాడి చేశారు.

ఏమి మాట్లాడకుండానే

విచక్షణా రహితంగా దాడి: వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌ రోల్‌ పోషించే నాయకులే లక్ష్యంగా టీడీపీ టార్గెట్‌ చేసిందని ఈ ఘటన రుజువు చేస్తోంది. పట్టణంలో సైదాపురం చంటి, అమరేష్‌రెడ్డి అండ్‌ టీమ్‌ యాక్టివ్‌గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం కోసం పని చేస్తున్నారు. వీరికి ఎలాంటి పాత గొడవలు కూడా లేవు. వైఎస్సార్‌సీపీ పార్టీకి వీరవిధేయులు.. అదొక్కటే ప్రధాన కారణమైంది. క్రియాశీలక నేతలపై దాడి చేయడంతో భయాందోళనతో వైఎస్సార్‌సీపీ కేడర్‌ను చిన్నాభిన్నం చేయాలనే దృఢ సంకల్పంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు బాధితులు వివరిస్తున్నారు. నిల్చొని ఉన్న వ్యక్తులపై అకారణంగా మాట కూడా మాట్లాడకుండా.. బీటెక్‌ రవి వర్గీయులు దాడి చేయడం వెనుక పులివెందులలో భయోత్పాతం సృష్టించే ఎత్తుగడగా పలువురు వెల్లడిస్తున్నారు.

బాధితుల్ని పరామర్శించిన

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల పట్టణం శ్రీకర్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద టీడీపీ నేతల హత్యాయత్నం సంఘటనలో గాయపడ్డ బాధితులు సైదాపురం సురేష్‌రెడ్డి, అమరేష్‌రెడ్డి, శ్రీకాంత్‌, నాగేష్‌, తన్మోహన్‌రెడ్డిలను డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చిన్నప్ప, రజనీకాంత్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులపై స్థానిక వైద్యులతో చర్చించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక భౌతిక దాడులు ఎంచుకోవడాన్ని పలువురు తీవ్రంగా తప్పుబట్టుతున్నారు.

వివాహానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యాయత్నం

తెలుగుదేశం పార్టీ కార్యాలయంసమీపంలో ఫంక్షన్‌ హాల్‌

వేచియున్న వైఎస్సార్‌సీపీ నేతలపైమూకుమ్మడిగా దాడి

సైదాపురం సురేష్‌రెడ్డి, అమరేష్‌రెడ్డిలను టార్గెట్‌ చేసిన బీటెక్‌ రవి అనుచరులు

పరామర్శించిన కడప ఎంపీవైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందులలో భయోత్పాతం! 1
1/1

పులివెందులలో భయోత్పాతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement