
● ప్రతిఘటిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుతమ్ముళ్లు కుట్రలకు తెరలేపుతున్నారు. టీడీపీకి బీజేపీ తోడు కావడంతో ‘లెక్క’ లేనన్ని కుట్రలు, బెదిరింపుల కుతంత్రాలు తెరపైకి తెరపైకి తెస్తున్నారు. ఒక్క జెడ్పీటీసీ సీటు కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదారులు ఎంచుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను ప్రలోభాలకు గురిచేయడం లేదంటే బెదిరింపులకు దిగుతున్నారు. ఈమొత్తం వ్యవహారం పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జీ బిటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కేంద్రంగా నడుస్తోంది.
● ఈనెల 12న జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి సర్కార్ అడ్డదారులు ఎంచుకుంది. వైఎస్సార్‌సీపీకి గణనీయమైన ప్రజాబలం ఉండడంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొలేమనే అంచనాకు టీడీపీ,బీజేపీ నేతలొచ్చారు. ఈ క్రమంలో ప్రలోభాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు పులివెందుల పరిధిలో ఇద్దరు నేతలకు టీడీపీ కండువా కప్పారు. మరికొందర్ని అలాగే పార్టీ మార్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కూటమి నేతల యత్నాలను కొంతమంది తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అలాంటి వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అప్పటికీ కాదు కూడదన్నవారికి పోలీసు వ్యవస్థ ద్వారా భయపెడుతున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎటువంటి కేసులు లేకున్నప్పటికీ ఎన్నికలలో గ్రామ స్థాయి నాయకుల ప్రభావాన్ని కట్టడి చేసే చర్యలకు దిగారు.‘అసలెందుకు పోలీసుస్టేషన్‌కు మమ్మల్ని పిలిపించార’ని ఎవరైనా అడిగితే గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తల కోసం పిలిచామని బదులిస్తున్నట్లు సమాచారం. పోలీసు వ్యవస్థ శృతిమించి వ్యవహరించే అవకాశం కూడా లేకపోలేదనే వాదనలు విన్పిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ కోసం కృషి చేస్తే తప్పు లేదు కానీ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ప్రజాస్వామ్యవాదులు వెల్లడిస్తున్నారు.
ఉస్కో అంటే చాలు..
ఎగిరిపడుతున్న వ్యవస్థలు
జెడ్పీటీసీ ఎన్నికలల్లో ఓడిపోతామనే భయంతో కనీస పరువు దక్కించుకోవాలనే దిశగా టీడీపీ, బీజేపీ నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. ఆ మేరకు వ్యవస్థలను ఇప్పటినుంచే వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం కడప విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐ శివన్న తదితర అధికారులు తనిఖీల పేరిట పల్లె బాట వెళ్లారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడుగా ఉన్న అచ్చవెల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ జనార్ధన్‌రెడ్డి రేషన్‌షాపులో రెవెన్యూ, విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు ఉమ్మడిగా తనిఖీలు చేపట్టారు. నిర్ణయిత పరిమితి కంటే 2కిలోలు బియ్యం తక్కువగా ఉన్నాయని కేసు నమోదు చేశారు. రేషన్ డీలర్ రూ.2 విలువైన రెండు కిలోలు బియ్యం స్వాహా చేశారని కేసు నమోదు చేయడాన్ని ఆశ్చర్యం కల్గించినా విజిలెన్సు అఽధికారులు కేసు నమోదు చేసిన విషయం వాస్తవమే. ఈ సాకుతో రేషన్ డీలర్‌షిప్‌ను రద్దు చేసే ఎత్తుగడను ఎంచుకున్నట్లు సమాచారం.
ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్న బీటెక్ రవి, ఎమ్మెల్యే ఆది ద్వయం
మాట పెడచెవిన పెట్టినవారిపై వ్యవస్థలతో దాడి
అచ్చవెళ్లి రేషన్‌షాపు డీలర్‌పై విజిలెన్సు తనిఖీలు బెదిరింపులో భాగమే
తెరపైకి వస్తున్న పోలీసు అధికారుల వేధింపులు
జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రలోభాలు బెదిరింపులను వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రతిఘటిస్తున్నాయి. పులివెందులలో ఇటీవల పార్టీ ఫిరాయించిన ఇరువురు నేతలు పలు రకాలుగా ఆశలు చూపుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో ‘మీరా..మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసేది, మీరేంత, మీ స్థాయి, శక్తి ఎంత?’ అంటూ బాహాటంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత సమస్యలుండొచ్చు అంతమాత్రనా వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని తెంచలేరంటూ పలువురు తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. ‘మీరేదో కక్కుర్తి పడి వెళ్లారు, ఇలాంటి వ్యవహారాల్లో తలదూరిస్తే.. ఇక మర్యాద ఉండదు..’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

● ప్రతిఘటిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

● ప్రతిఘటిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు