నంద్యాల డయాసిస్‌ బిషప్‌ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

నంద్యాల డయాసిస్‌ బిషప్‌ ఎంపిక

Aug 4 2025 3:24 AM | Updated on Aug 4 2025 3:24 AM

నంద్య

నంద్యాల డయాసిస్‌ బిషప్‌ ఎంపిక

కలసపాడు: నంద్యాల డయాసిస్‌ బిషప్‌గా కలసపాడుకు చెందిన కె.సంతోష్‌ ప్రసన్నరావును సినాడ్‌ సభ్యులు ఎన్నుకున్నారు. బిషప్‌గా ఉన్న పుష్పలలిత రిటైర్డ్‌ కావడంతో 2024 ఏప్రిల్‌లో జరిగిన బిషప్‌ ఎన్నికల్లో రెవరెండ్లు సంతోష్‌ ప్రసన్న రావు, నందం ఐజాక్‌, సాల్మన్‌, ఐజాక్‌ ప్రసన్న కుమార్‌ పోటీ పడ్డారు. సినాడ్‌ డయాసిస్‌లో మోడరేటర్‌ లేకపోవడంతో నంద్యాల బిషప్‌ ఎంపిక ఆలస్యమైంది. ఇటీవల మోడరేటర్‌ను ఎన్నుకున్నారు. ఆదివారం సినాడ్‌ సభ్యులు కె.సంతోష్‌ ప్రసన్న రావును బిషప్‌గా ఎన్నుకున్నారు. డిగ్రీ, బీఈడీ పూర్తి చేసిన సంతోష్‌ ప్రసన్న రావు హైదరాబాద్‌లోని బైబిల్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి పాస్టర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ముద్దనూరు ఫాస్ట్రేట్‌ చర్చి డీనరీ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన బిషప్‌గా ఎంపిక కావడంపై నంద్యాల డయాసిస్‌ చర్చి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం కేథడ్రాల్‌ చర్చిలో సంతోష్‌ ప్రసన్నరావుకు బిషప్‌గా పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

కాల్‌ సెంటర్‌ సేవలు వినియోగించుకోవాలి

కడప సెవెన్‌రోడ్స్‌: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులుతమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్‌కు కాల్‌ చేయవచ్చని పేర్కొన్నారు.

సభాభవన్‌లో పీజీఆర్‌ఎస్‌ నిర్వహణ

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)ను సోమవారం సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతోపాటు మండల, మున్సిపల్‌ స్థాయిలో కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562–244437 ల్యాండ్‌ లైన్‌ నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు.

చెస్‌లో జిల్లా

క్రీడాకారుల ప్రతిభ

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: బెంగుళూరులో జరిగిన 3వ చెస్‌ ప్యూషన్‌ నేషనల్‌ లెవల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో జిల్లాకు చెందిన చెస్‌ క్రీడాకారులు ప్రతిభ చాటారని చెస్‌ కోచ్‌ అనీష్‌ దర్బారీ పేర్కొన్నారు. బెంగుళూరులోని గోల్డోన్‌ బీ గ్లోబల్‌ స్కూల్‌లో జరిగిన 3వ చెస్‌ ప్యూషన్‌ నేషనల్‌ లెవల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో అండర్‌–8లో బాలికల విభాగంలోజిల్లాకు చెందిన వినమత్ర ట్రోపీ గెలుచుకుందన్నారు. అండర్‌ –10లో బాలికల విభాగంలో ప్రొద్దుటూరు చెందిన ధనిత మెడల్‌ అందుకుందన్నారు. కాగా కాగా సీనియర్స్‌ విభాగంలో చెస్‌ కోచ్‌ అనీష్‌ దర్బారీ ప్రథమ స్థానంలో నిలిచి నగదు బహుమతి అందుకోవడం విశేషం.

ఇంటర్‌ ఎంప్లాయీస్‌

అసోసియేషన్‌ కమిటీ ఎన్నిక

కడప ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఎలక్షన్‌ ఆఫీసర్‌ నిత్యపూజయ్య ఆధ్వర్యంలో నామినేషన్‌ స్వీకరణ చేపట్టగా అన్ని పోస్టులకు ఒక్కో నామినేషన్‌ చొప్పున దాఖలు అయ్యాయి. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇందులో ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడిగా సురేష్‌, కార్యదర్శిగా వెంకటసుబ్బయ్య, వైస్‌ ప్రెసిడెంట్‌గా ఖాదర్‌ హుస్సేన్‌, జాయింట్‌ సెక్రటరీగా మల్లికార్జునరాజు, ట్రెజరర్‌గా రాధాకృష్ణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా శివప్రసాద్‌, ఉమెన్‌ సెక్రటరీగా ఇందుమతి, ఈసీ మెంబర్లుగా బాలనరసయ్య, శివప్రసాద్‌, చరణ్‌లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న అధ్యక్ష, కార్యదర్శులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

నంద్యాల డయాసిస్‌  బిషప్‌ ఎంపిక 1
1/4

నంద్యాల డయాసిస్‌ బిషప్‌ ఎంపిక

నంద్యాల డయాసిస్‌  బిషప్‌ ఎంపిక 2
2/4

నంద్యాల డయాసిస్‌ బిషప్‌ ఎంపిక

నంద్యాల డయాసిస్‌  బిషప్‌ ఎంపిక 3
3/4

నంద్యాల డయాసిస్‌ బిషప్‌ ఎంపిక

నంద్యాల డయాసిస్‌  బిషప్‌ ఎంపిక 4
4/4

నంద్యాల డయాసిస్‌ బిషప్‌ ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement