
అన్నింట్లో ‘కోత’లే!
మాటల్లో.. సాయంలో..
కడప అగ్రికల్చర్: కూటమి ప్రభుత్వం రైతులను మరోసారి దగా చేసింది. అధికారంలోకి రాకముందేమో అన్నదాత సుఖీభవ కింద ఏటా ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇస్తామని చెప్పి మాటల్ని కోటలు దాటించింది. అధికారంలోకి వచ్చాక నిధుల్లో కోత కోసింది. రైతులకు వ్యవసాయంలో అండగా నిలబడాల్సింది పోయి అవస్థలకు గురి చేస్తోంది. తాజాగా అన్నదాత సుఖీభవ పథకంలో పలు రకాల కొర్రీలతో కోత విధించి ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసిన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా నిధులను మంజూరు చేసి ఆర్థిక చేయూతనందించి పంటలసాగుకు అండగా నిలిచింది. కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా సాయంలో కోత కోసింది. వివిధ కారణాలను సాకుగా చూపిస్తూ అన్నదాత సుఖీభవ నిధుల్లో ఎగనామం పెట్టింది. జిల్లావ్యాప్తంగా 16,434 మంది నిధులందక కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెబ్‌ల్యాండ్ అధారంగా...
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు రైతులకు అందించిన రైతు భరోసా పథకానికి వెబ్‌ల్యాండ్‌లో భూమి ఉందా లేదా అని మాత్రమే పరిశీలించి పేర్లున్న ప్రతిరైతుకు ఆర్థిక భరోసా కింద ఏటా రూ.13,500 సహాయం అందించారు. దీనివల్ల ఒక్క రైతుకు నష్టం కలగలేదు. అందరికీ సహాయం అందింది. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో రూ.1191.03 కోట్ల మేర రైతులకు లబ్థి చేకూరింది.
ఇప్పుడు కొర్రీలు....
కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయాన్ని ఏటా ఇస్తామని ప్రకటించింది. మొదటి ఏడాది రైతులకు ఎగనామం పెట్టిన ప్రభుత్వం..రెండో ఏడాదిలో దీన్ని అమలు చేయడం కోసం కొర్రీలు విధించింది. లేనిపోని నిబంధనలు పెట్టడంతో జిల్లాలో 16,434 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత కొల్పోయారు. దీంతో పథక అమలులోనే తొలి విడత నిధుల కింద రూ. 11.50 కోట్ల ఆర్థిక సహాయన్ని పొందలేకపోయారు. అసలే కరువుతో ఇబ్బందులు పడు తున్న రైతాంగానికి అండగా నిలవాల్సిన ప్రభు త్వం పథకం అమలులో మొండిచెయ్యి చూపింది. ఈ లెక్కన అర్హత కోల్పోయిన రైతులు ఏడాది మొత్తానికి రూ.20 వేలు చొప్పున రూ. 328.68 కోట్లు మేర నష్టపోనున్నారు.
వైఎస్సార్ ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా, పీఎం కిసాన్ నిధుల వివరాలు
సంవత్సరం రైతుల విడుదలైన
సంఖ్య నిధులు (కోట్లలో)
కూటమి ప్రభుత్వంలో 1,94,047 మందికే అన్నదాత సుఖీభవ
జిల్లావ్యాప్తంగా 16,434 మందికి ఎగనామం
తొలి విడతలో రూ.11.50 కోట్లు నష్టపోయిన రైతులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2,10,481 మంది రైతులకు లబ్ధి
2019–20 206708 279.93
2020–21 208747 280.06
2021–22 199344 269.11
2022–23 202598 235.68
2023–24 210481 277.56

అన్నింట్లో ‘కోత’లే!

అన్నింట్లో ‘కోత’లే!