
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులకు బాధ్యతల అప్పగింత
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా ఇటీవల నియమితులైన ఎస్. గురుమోహన్, కె. నాగేంద్రారెడ్డి, ఆర్. వెంకట సుబ్బారెడ్డిలకు ఆ పార్టీ కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు. గురుమోహన్‌కు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆర్. వెంకట సుబ్బారెడ్డికి కమలాపురం, బద్వేల్ నియోజకవర్గాలు, కె. నాగేంద్రారెడ్డికి పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలను సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు. వీరు రీజనల్ కో ఆర్డినేటర్లు, పరిశీలకులు, అసెంబ్లీ సమన్వయకర్తలను సమన్వయం చేయాలని సూచించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రసాద్‌రెడ్డి, పి. సునీల్ కుమార్ పాల్గొన్నారు.
అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకం
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. స్టూడెంట్ విభాగం అధ్యక్షులుగా కె.సుబ్బయ్య (డేవిడ్), ఎస్సీ విభాగం అధ్యక్షులుగా గజ్జెల కిరణ్, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా ఎస్.చంద్రశేఖర్‌రెడ్డిలను నియమించారు.