
ఫిష్ ఆంరధ్రలో చోరీ
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని అంబకపల్లె రోడ్డులో ఇందిరమ్మ రాణి తోపు ఎదురుగా ఉన్న ఫిష్ ఆంధ్రలో దొంగలు పడ్డారు. గత కొంతకాలంగా ఫిష్ ఆంధ్ర తెరవకపోవడంతో ఇది గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు అద్దాలు పగులగొట్టి అందులోని మూడు ఏసీలను అపహరించారు. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఫిష్ ఆంధ్రలోని ఏసీలు చోరీకి గురయ్యాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి విలువైన వస్తువులు చోరీకి గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లారీని ఢీకొన్న వాహనం : ఇద్దరికి గాయాలు
చింతకొమ్మదిన్నె : కడప– చిత్తూరు జాతీయ రహదారిపై జమాలపల్లె షెంఫర్డ్ పాఠశాల సమీపంలో శనివారం ఆగి ఉన్న లారీ (ఆర్‌జే 09జీ ఈ 0313)ని లక్కిరెడ్డిపల్లి నుంచి క డపకు మామిడి పండ్ల లోడుతో వస్తు న్న బొలెరో పికప్ (ఏపీ04 యూఏ 1171) వాహనం ఢీకొంది. ఈ ప్ర మాందంలో పఠాన్ మౌలాలి(డ్రైవర్), నూర్ బీలు వాహనంలో ఇరుక్కుపోగా వారిని హైడ్రాలిక్ టూల్స్ సహాయంతో బ యటికి తీసి హైవే పెట్రోలింగ్ పోలీసులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
గల్లంతైన యువకుడి కోసం గాలింపు
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు మండల పరిధిలోని పెన్నానదిలో గల్లంతైన గోపాల్ అనే యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం గూడెంచెరువు గ్రామంలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు వచ్చి పెన్నానదిలో షేక్ మున్నా, గోపాల్ అనే యువకులు గల్లంతైన విషయం విదితమే. షేక్ మున్నా మృతదేహం లభించగా గోపాల్ ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం రాత్రి 9 గంటల వరకు గజ ఈతగాళ్లు గాలించినా ఫలితం లేదు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు ఆపివేశారు. తిరిగి ఆదివారం గాలింపు చర్యలు కొనసాగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

ఫిష్ ఆంరధ్రలో చోరీ