ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాటం
పులివెందుల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతరపున నిరంతరం పోరాటాలు చేస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసపూరిత మాటలతో కాలం నెట్టుకొస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడుకు కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ప్రజలు గుర్తుండరని విమర్శించారు. ఆయనకు రాష్ట్ర భవిష్యత్తు కంటే కక్ష సాధింపు రాజకీయాలే ఎక్కువయ్యాయని మండిపడ్డారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఎంపీని కలిసిన ఎండీయూ ఆపరేటర్లు
బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పట్టణంలోని ఎండీయూ ఆపరేటర్లు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమను ఉన్నఫలంగా విధుల నుంచి తొలగించిందన్నా రు. 2027వ సంవత్సరం జనవరి వరకు అగ్రిమెంట్ ఉన్నా కూడా అక్రమంగా ప్రభుత్వం తొలగిస్తోందని ఎంపీ దృష్టికి తెచ్చారు. దీనికి ఎంపీ మాట్లాడుతూ ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం దారుణమని, జగనన్న ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ అందించడం ద్వారా ప్రజలకు మేలు జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.
ఒక్కరూపాయి భారం పడకుండా
క్రాప్ లోన్స్ రుణాలు చేయాలి
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని రైతులు కలిశారు. ఈ సందర్భంగా వారు క్రాప్ లోన్ల విషయమై తాము పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన రైతులతో కలిసి స్థానిక స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లి మేనేజర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మేనేజర్‌తో మాట్లాడుతూ రైతుల మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా క్రాప్ లోన్స్ రుణాలు చేయాలన్నారు. ప్రస్తుతం రైతులపై అధిక వడ్డీ భారం మోపడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అనంతరం కడప రీజినల్ మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
ఎంపీని కలిసిన బ్యాంక్ అధికారులు
కడప రీజినల్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి చీఫ్ మేనేజర్ సీఎస్ ఆనంద్ పులివెందుల మెయిన్ బ్రాంచ్ మేనేజర్ శ్యామలారావు బుధవారం సాయంత్రం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లి ఆయన కలిసి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రైతులపై ఒక రూపాయి కూడా భారం పడకుండా చూస్తామని ఎంపీకి వివరించారు.
ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు దారుణం
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


