రైతులను ఆదుకోండి: నరేన్
రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీకే దిన్నె జెడ్పీటీసీ నరేన్ రామాంజులరెడ్డి కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ఉత్పత్తులకు ఎంఎస్‌పీ చెల్లించడం లేదన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయకపోవడం విచారకరమన్నారు. అరటి, బొప్పాయి పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇందుకు కలెక్టర్ బదులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన రైతుల జాబితాలో ఇప్పటివరకు 2.10 లక్షల మందిని వెరిఫై చేశామని, ఇంకా మిగిలిన కొంతమందిని వెరిఫై చేసి పంపుతామన్నారు.


