వైభవంగా పల్లకీ సేవ
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి పల్లకీ సేవ సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ మాఢవీధులు, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.కార్యక్రమంలో ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు
స్లాట్ బుకింగ్
కడపకోటిరెడ్డిసర్కిల్: రిజిస్ట్రేషన్‌శాఖలో క్రయ, విక్రయాలకు స్లాట్ సదుపాయం అందుబాటు లోకి రానుంది. కక్షిదారులకు సులభతర, వేగవంతమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. జిల్లాలో తొలుత కడప ఆర్‌ఓ కార్యాలయంలో అమలు కానుంది. పనిదినాల్లో ఉదయం 10–30 గంటల నుంచి సాయంత్రం 5–30 మధ్యలో స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల రోజంతా నిరీక్షించే పనితప్పుతుంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి వుంటుంది. ప్రజలకు ఎలాంటి అసౌక ర్యం లేకుండా రిజిస్ట్రేషన్ సులభతరంగా పూర్తవుతుంది. ఈ విధానం విజయవంతం అయితే రాబోవు రోజుల్లో అన్ని సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయాల్లో ప్రవేశ పెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కాగా కడప ఆర్‌ఓ కార్యాలయంలో ఏప్రిల్ 4 నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.ఈసందర్భంగా జిల్లా రిజిస్టార్ పీవీఎన్.బాబు మాట్లాడుతూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సమయం వృథా కాదని తెలిపారు.
విభజన హామీలు
అమలు చేయాలి
కడప రూరల్: ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవ స్థాపక అధ్యక్షులు ఎస్ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ హామీల అమలులో భాగంగా కడపకు స్టీల్ ప్లాంట్, దుగ్గిరాజుపట్నం ఎయిర్‌పోర్ట్, వైజాగ్–చైన్నె ఇండస్ట్రీయల్ కారిడార్, విమానాశ్రయా లను అంతర్జాతీయ స్ధాయిలో అభివృద్ధి చేయడంతోపాటు నీటి ప్రాజెక్ట్‌లు, విద్యా, పారిశ్రామిక ప్రగతికి చెందిన ఎన్నో అంశాలు అమలు కావాల్సివుందన్నారు. కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రి రాజ శ్రీనివాసరావు, చంద్రశేఖర్, సీఆర్‌వీ ప్రసాద్, ఓబయ్య తదిరులు పాల్గొన్నారు.
వైభవంగా పల్లకీ సేవ


