కడపలో తల్లీతనయుల అదృశ్యం! | - | Sakshi
Sakshi News home page

కడపలో తల్లీతనయుల అదృశ్యం!

Dec 10 2023 1:20 AM | Updated on Dec 10 2023 10:46 AM

- - Sakshi

కుమారులతో తల్లి షేక్‌ ఫర్హత్‌ అంజుమ్‌ (ఫైల్‌)

కడప అర్బన్‌ : కడప నగరం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తల్లీ, ఇద్దరు కుమారులు అదృశ్యమయ్యారు. వివరాలు ఇలా.. సాధుచెంగన్న వీధికి చెందిన షేక్‌ ఫర్హత్‌ అంజుమ్‌కు(35), బెల్లంమండివీధిలో నివాసం ఉంటున్న షేక్‌ అల్తాఫ్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు షేక్‌ అబ్దుల్లా(13), షేక్‌ ఇబ్రహీం(11)లు ఉన్నారు. ఆ తర్వాత భార్యాభర్తలు మనస్పర్థలతో విడిపోయారు. ఈ క్రమంలో ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి తల్లి షేక్‌ ముంతాజ్‌ బేగం వద్ద ఉంటోంది.

ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాసాపేటలోని ఓ స్కూల్‌లో చదువుతున్న తన ఇద్దరు కుమారులను తీసుకుని వస్తానని తల్లికి చెప్పి ఫర్హత్‌ వెళ్లింది. తరువాత తన కుమార్తె, ఇద్దరు మనుమల ఆచూకీ తెలియరాలేదని ముంతాజ్‌ బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఆచూకీ తెలిసిన వారు 9121100513, 9121100517, 9121100518 ఫోన్‌ నంబర్లలో లేదా పోలీస్‌ స్టేషన్‌లోగానీ, డయల్‌ 100కు గానీ సమాచారం ఇవ్వాలని కడప టు టౌన్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ సంజీవరాయుడు కోరారు.
ఇవి చ‌ద‌వండి: అనుమానాస్పద స్థితిలో భార్య మృతి! భర్తే ఇలా చేశాడని..

Advertisement
 
Advertisement
Advertisement