శేషవాహనంపై శ్రీ సిద్దేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

శేషవాహనంపై శ్రీ సిద్దేశ్వరుడు

Jul 28 2026 2:12 AM | Updated on Jul 28 2026 2:12 AM

రాజంపేట: తాళ్లపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమ వారం శేషవాహనంపై శ్రీ సిద్దేశ్వరస్వామి పురవీధుల్లో ఊరేగారు. అలాగే ఉదయం శ్రీ చెన్నకేశవ స్వామివార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. రాత్రికి శ్రీ చెన్నకేశవస్వామి సింహవాహనంపై గ్రామపురవీధుల్లో ఊరేగారు.

సూర్య, చంద్రప్రభ వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి

నందలూరు : శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు సోమవారం ఉదయం కూర్మాలంకారంలో సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై శ్రీ సౌమ్యనాధ స్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నేడు సౌమ్యనాథ స్వామి కళ్యాణం

సౌమ్యనాథాలయంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలోపు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథుడు (చొక్కనాథుడు) కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు టీటీడీ దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పుగాలిగోపురం ద్వారా మాత్రమే భక్తులు ఆలయంలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement