
నూతన వధూవరులు రాజ్ లక్ష్మీ, విష్ణువర్దన్‌రెడ్డి
వైఎస్సార్ : ఆంధ్ర అబ్బాయి, ఒడిశా అమ్మాయి ఇద్దరు ఒక్కటైన సంఘటన రాజుపాళెం మండలం వెల్లాల గ్రామంలోని సీతారాముల కల్యాణ మండపంలో జరిగింది. ఇదే మండలంలోని పర్లపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు బుక్కసముద్రం జగదీశ్వరరెడ్డి సోదరుడు బుక్కసముద్రం విష్ణువర్దన్‌రెడ్డి గత 15 ఏళ్లుగా ఒడిశా రాష్ట్రంలోని పోరాపుట్ జిల్లాలో ఉన్నాడు.
ఈ క్రమంలో గత మార్చిలో పోరాపుట్ జిల్లాలోని జయపురం మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందాడు. శుక్రవారం ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ రాజ్‌లక్ష్మిని విష్ణువర్దన్‌రెడ్డి వెల్లాల సీతారామల కల్యాణ మంపడంలో వివాహం చేసుకున్నాడు.
వధూవరులను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎసార్‌సీపీ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, ఇన్‌చార్జి ఎంపీపీ నారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు అంజనీకుమారి, బుక్కసముద్రం జగదీశ్వరరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు ప్రవల్లిక, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఆశీర్వదించారు.