
ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను ప్రొటోకాల్ నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా సీకే దిన్నె మండల పరిధిలోని పబ్బాపురం సమీపంలో బహిరంగ సభా స్థలం వద్ద, భద్రతా ఏర్పాట్లు, ప్రొటోకాల్ నిబంధనల అమలుపై గురువారం జేసీ అదితిసింగ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. సభా ప్రాంగణం, పరిసరాలలో పారిశుద్ధ్య పనులు పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కడప, బద్వేలు ఆర్డీవోలు జాన్ ఇర్విన్, చంద్రమోహన్, కేఎంసీ కమీషనర్ మనోజ్ రెడ్డి, డీపీవో రాజ్యలక్ష్మి, జెడ్పి సీఈవో ఓబులమ్మ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు, ఫైర్ ఆఫీసర్ ధర్మా రావు, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, పీఆర్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కడప అర్బన్: కడప నగర శివార్లలోని సీకేదిన్నె పరిధిలోని పబ్బాపురంలో ఈనెల 27,28,29 తేదీల్లో జరగనున్న ’మహానాడు’ నేపథ్యంలో ఐ.జి.పి (ఆపరేషన్స్) సి.హెచ్.శ్రీకాంత్, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గురువారం భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన వేదిక, ఫుడ్ కోర్ట్ ల వద్ద చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై రాయలసీమ జిల్లా ఎస్పీలు ఈ.జి అశోక్ కుమార్, విద్యాసాగర్ నాయుడు, అధిరాజ్ సింగ్ రాణా, ఎస్.పి పి.జగదీశ్, గుంతకల్ రైల్వే ఎస్.పి రాహుల్ మీనా ఇతర పోలీస్ అధికారులకు ఐ.జి.పి(ఆపరేషన్స్) సి.హెచ్.శ్రీకాంత్ దిశా నిర్దేశం చేశారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు వారు సూచించారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, జిల్లా, ఇతర జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భద్రతా ఏర్పాట్లు పరిశీలన

ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలి