
పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి
కడప కార్పొరేషన్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్లమెంటు పరిశీలకులు అజయ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, ఎంవీ రామచంద్రారెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డిలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడుస్తోందని, వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటూ పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని, న్యాయపరంగా వాటిని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. తమపై అన్యాయంగా, అక్రమంగా వ్యవహరించే వారికి భవిష్యత్‌లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అంతకుముందు కడప పార్లమెంటు పరిశీలకులుగా నియమింపబడి తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా అజయ్‌రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి సత్కరించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి