పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది
నేర సమీక్షలో మాట్లాడుతున్న ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్
కడప అర్బన్ : జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధిల్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం కడప నగరంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్‌హాల్‌లో డీఎస్పీలు, సీఐలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయా పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అతి తీవ్రమైన నేరాలలో త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేస్తూ సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలపై నేరాలు, రాబరీ, డకాయిట్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. పోక్సో, మహిళలపై జరిగిన నేరాలపై నిర్ణీత సమయంలో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. మహిళలు, బాలికల అదృశ్యం కేసుల్లో సమగ్ర విచారణ జరిపి అదృశ్యమైన వారి ఆచూకీ త్వరగా తెలుసుకోవాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నాటుసారా రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపట్టడంతోపాటు నిఘా పెంచాలన్నారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. నిషేధిత గుట్కా, దేశీ అక్రమమద్యం, ఇసుక అక్రమ రవాణాపై దాడులను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఎస్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని వివరించారు. ఈ సమావేశంలో ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేర్ణాకుమార్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ నీలం పూజిత, ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్.ఎస్.ఎస్.వి కృష్ణారావు, డీపీఓ ఏఓ జ్యోతి, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.


