యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలో, యాదగిరి కొండ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డులో వాహనదారులు రాంగ్ రూట్‌లో వెళ్తుండడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అయినప్పటికీ వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. గురువారం ఉదయం టెంపుల్ సిటీకి వెళ్లే దారిలో ఉన్న సర్కిల్ రోడ్డు నుంచి యాదగిరిగుట్ట వైపు వెళ్తున్న ట్రాక్టర్ రాంగ్ రూట్‌లో వస్తూ కనిపించింది. అదే సమయంలో యాదగిరిగుట్ట నుంచి మల్లాపురం వైపు వాహనాలు వెళ్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి రాంగ్‌రూట్‌లో వెళ్లే వాహనదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


