డీసీఎం మీదపడి మృతి | - | Sakshi
Sakshi News home page

డీసీఎం మీదపడి మృతి

Jun 23 2026 10:24 AM | Updated on Jun 23 2026 10:24 AM

గొర్రెల మందకు కాపలాగా ఇంటి ముందు మంచంపై నిద్రించిన మృతుడు

అదుపుతప్పి దూసుకొచ్చిన డీసీఎం

వేములపల్లి : గొర్రెల మందకు కాపలాగా ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తిపై డీసీఎం పడిపోవడంతో మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వేములపల్లి మండల పరిధిలోని బుగ్గబావిగూడెంలో జరిగింది. స్థానికులు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గబావిగూడేనికి చెందిన పోలెబోయిన వెంకన్న(49) గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి తమ గొర్రెల మందకు కాపలాగా ఇంటి ముందు మంచంపై నిద్రించాడు. సోమవారం తెల్లవారుజామున నల్లగొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న డీసీఎం బుగ్గబావిగూడెం గ్రామ పరిధిలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొని మంచంపై నిద్రిస్తున్న పోలెబోయిన వెంకన్నపై పడిపోయింది. దీంతో వెంకన్న అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో డీసీఎంను పక్కకు తప్పించి వెంకన్న మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య పూలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement