కష్టపడే నాయకులకు సముచిత స్థానం | - | Sakshi
Sakshi News home page

కష్టపడే నాయకులకు సముచిత స్థానం

Jun 23 2026 10:24 AM | Updated on Jun 23 2026 10:24 AM

భువనగిరిటౌన్‌ : కాంగ్రెస్‌ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు రాబోయే రోజుల్లో పార్టీ పదవుల్లో, ప్రభుత్వ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ తెలిపారు. సోమవారం ఆమె, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌ కలిసి వరంగల్‌ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యలో భువనగిరి పట్టణ బైపాస్‌ రోడ్డులోని న్యూవివేరా హోటల్‌ వద్ద ఆగారు. వారికి యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్‌ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్‌ పార్టీ గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బూత్‌ స్థాయి ప్రతినిధులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేలా బూత్‌ స్థాయి ప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, నాయకులు పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, బర్రె జహంగీర్‌, దర్గాయి హరిప్రసాద్‌, ఎనగండ్ల సుధాకర్‌, గుమిడెల్లి రమేష్‌ ఉన్నారు.

ఫ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల

ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement