ఆలేరు: ఎట్టకేలకు ఆలేరు మున్సిపాలిటీలో ఖాళీ పోస్టులు భర్తీ అయ్యాయి. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టులను రెగ్యులర్ అధికారులతో భర్తీ చేశారు. ఖజానా ఫుల్..అభివృద్ధి నిల్ అనే శీర్షికన గత నెల 17వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించారు. ఆలేరు మున్సిపాలిటీలో ఖాళీల భర్తీకి పూనుకున్నారు. ఇందులో భాగంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ నుంచి సీనియర్ అసిస్టెంట్ రవికుమార్, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పుట్ట శ్రీనివాస్, భువనగిరి మున్సిపాలిటీ నుంచి జూనియర్ అసిస్టెంట కొలుపుల రాజు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నుంచి వార్డు ఆఫీసర్ రేణుకను ఆలేరు మున్సిపాలిటీకి బదిలీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ ప్రాంతీయ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల బదిలీపై ఆలేరు మున్సిపాలిటీకి ఇన్‌చార్జిగా వచ్చిన జనగామ మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారి(టీపీఓ) మూడు రోజుల్లోనే బదిలీపై వెళ్లిపోయారు. దాంతో టీపీఓ పోస్టు మళ్లీ ఖాళీ అయింది.


