భువనగిరి : విద్యార్థి దశలోనే ప్రతి రంగంలోనూ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరమని అదనపు కలెక్టర్లు భాస్కరరావు, వెంకారెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లో ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో విద్యార్థులు టైలరింగ్ డ్యూటీస్ కంప్యూటర్ కోర్సుల్లో రాణించి ఉపాధి అవకాశాలు పెంచుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి ఉపాధి కల్పన జిల్లా అధికారి సాహితీ జిల్లా యువజన క్రీడల అధికారి ధనుంజయ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, ఆలేరు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ, శివరామకృష్ణ అంజిరెడ్డి, కిషోర్ విద్యార్థులు పాల్గొన్నారు
జనగణన విధులు బాధ్యతగా నిర్వహించాలి
భువనగిరిటౌన్ : జనగణన విధులు పారదర్శకంగా, బాధ్యతగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జనగణన రెండవ బ్యాచ్ శిక్షణ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లను ఉద్దేశించి మాట్లాడారు. శిక్షణలో భాగంగా ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే అంశాలను జాగ్రత్తగా గమనించి, విధుల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. అధికారులంతా సమన్వయంతో జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్లు భాస్కరరావు, వెంకారెడ్డి


