
యాదగిరి క్షేత్రంలో ఏకాదశి పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఏకాదశిని పురస్కరించుకొని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను వివిధ పుష్పాలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సహస్రనామ పఠనాలు, వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేపట్టారు. స్వామివారి మేల్కొలుపులో భాగంగా వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భగుడిలో స్వయంభువులను, సువర్ణ ప్రతిష్ఠామూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో శాస్త్రోక్తంగా అర్చించారు.