దసరాకు ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

దసరాకు ప్రత్యేక బస్సులు

Sep 19 2025 3:02 AM | Updated on Sep 19 2025 3:02 AM

దసరాక

దసరాకు ప్రత్యేక బస్సులు

డిపోల వారీగా నడపనున్న ప్రత్యేక బస్సుల సంఖ్య

రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడుపుతాం

మిర్యాలగూడ టౌన్‌: తెలంగాణలో ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ప్రజలు దసరా పండుగకు సొంతూళ్లకు వస్తూ ఉంటారు. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆర్టీసీ ఇటీవల వివిధ పండుగల సమయంలో ప్రత్యేక బస్సులు నడిపి కొంతవరకు ఆదాయం సమకూర్చుకున్నప్పట్టికీ.. దసరా పండుగ ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఉమ్మడి జిల్లాలోని నార్కట్‌పల్లి, యాదగిరిగుట్ట, దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట డిపోల నుంచి దసరా పండుగ సందర్భంగా తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను అధికారులు నడిపించనున్నారు. నల్లగొండ రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోల నుంచి ఈ నెల 20న 50 బస్సులు, 21న 50, 22న 55, 23న 50, 24న 50, 25న 50, 26న 60, 27న 65, 28న 65, 29న 70, 30న 65, అక్టోబర్‌ 1న 65, 2వ తేదీన 10 బస్సుల చొప్పున నడిపించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌, సాగర్‌ రింగ్‌ రోడ్డు, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు, ఎల్బీ నగర్‌ తదితర ప్రాంతాల్లో ఆయా డిపోలకు చెందిన ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నారు.

ఫ ఈ నెల 20 నుంచి

అక్టోబర్‌ 2 వరకు నడపనున్న ఆర్టీసీ

ఫ ఉమ్మడి జిల్లాలోని

ఏడు డిపోల నుంచి 705 బస్సులు

డిపో బస్సులు

దేవరకొండ 131

కోదాడ 94

మిర్యాలగూడ 115

నల్లగొండ 89

నార్కట్‌పల్లి 36

సూర్యాపేట 144

యాదగిరిగుట్ట 96

దసరా పండుగకు ప్రస్తుతం కేటాయించిన బస్సులతో పాటు ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడుపుతాం. నల్లగొండ రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోల పరిధిలో నుంచి మొత్తం 705 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నాం. ప్రయాణికులకు ఏఏ డిపో బస్సులు ఏఏ రూట్లలో వెళ్తున్నాయో తెలిపేందుకు ఏడు డిపోలకు చెందిన సిబ్బందిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. – కొణతం జానిరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం, నల్లగొండ

దసరాకు ప్రత్యేక బస్సులు1
1/1

దసరాకు ప్రత్యేక బస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement