
రైతులు నాణ్యమైన విత్తనాలు వాడాలి
మునగాల: రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త ఏ. రామకృష్ణ సూచించారు. జూలైలో మునగాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన 33మంది రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా కేఎన్‌ఎం 1638 వరి రకం, డబ్ల్యూ జిజి 385 పెసర రకం విత్తనాలను అందజేశారు. ఈ క్రమంలో మునగాల మండలంలోని తాడువాయి, మునగాల, గణపవరం, బరాఖత్‌గూడెం గ్రామాల్లో రైతులు సాగుచేసిన నూతన వరి వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్త రామకృష్ణ పరిశీలించారు. అనంతరం రైతులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల వ్యవసాయాఽధికారి బుంగా రాజుతో పాటు వ్యవసాయ విస్తరణాధికారులు రమ్యతేజ, నాగు, భవాని, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ
విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త రామకృష్ణ