
సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులు
రామన్నపేట : భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులు మాత్రమే నిజమైన వారసులని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో బుధవారం రాత్రి నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పకొట్టాలని పిలుపునిచ్చారు. సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీ విమోచనం పేరుతో హిందూ, ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 4వేల మంది ప్రాణాలు అర్పించి వేలాది గ్రామాలను విముక్తులను చేసి, లక్షల ఎకరాల భూములను పంచిన కమ్యూనిస్టుల పోరాట చరిత్రను ఎవరూ చెరపలేరని అన్నారు. ఈ సందర్భంగా సాయుధ పోరాట వీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, గడ్డం వెంకటేశం, కల్లూరి నాగేష్, జంపాల అండాలు, కందుల హన్మంత్, తొల్పునూరి శ్రీనివాస్, మేకల కృష్ణయ్య, గంటెపాక శివ, ఈర్లపల్లి ముత్యాలు, జోగుల శ్రీనివాస్, తొల్పునూరి చంద్రశేఖర్, నోముల రమేష్, బూడిద భిక్షం ఉమాపతి, భాషయ్య, ధనలక్ష్మీ, నాగార్జున, నర్సింహ పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
జూలకంటి రంగారెడ్డి