
డైరెక్టర్ పదవికి నామినేషన్ దాఖలు
శాలిగౌరారం: శాలిగౌరారం మండలం ఎన్‌జీ కొత్తపల్లి గ్రామానికి చెందిన గంట్ల రాధిక మదర్ డెయిరీ డైరెక్టర్ పదవి కోసం హైదరాబాద్‌లోని మదర్ డెయిరీ ప్రధాన కార్యాలయంలో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి ఏ. వెంకట్‌రెడ్డికి ఆమె అందజేశారు. రొటేషన్ పద్ధతిలో ఖాళీ అయిన మూడు డైరెక్టర్ స్థానాల్లో ఒకటి జనరల్(మహిళ)కు రిజర్వ్ కావడంతో నామినేషన్ దాఖలు చేసినట్లు రాధిక తెలిపారు. ఆమె వెంట ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్‌రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డి, డీసీసీ ఉపాద్యక్షుడు గంట్ల వేణుగోపాల్‌రెడ్డి, భైరవునిబండ, పెర్కకొండారం, ఇటుకులపహాడ్, శాపల్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల చైర్మన్లు అప్పారెడ్డి, యాదవరెడ్డి, సురేశ్, పాపయ్య తదితరులు ఉన్నారు.