
టీపీడీఎంఏ అధ్యక్షుడిగా తీకుళ్ల శ్రీనివాస్‌రెడ్డి
సూర్యాపేటటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్య సంఘం నూతన అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్పందన డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ తీకుళ్ల శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. చౌటుప్పల్‌లో బుధవారం జరిగిన సమావేశంలో సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు చెప్పారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా సీహెచ్. సత్యంగౌడ్, కోశాధికారిగా సుదినమోని హనుమంతుయాదవ్, ఉపాధ్యక్షుడిగా మెండు వెంకట్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా ఆంజనేయులు, ప్రవీణ్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి. శంకర్, కమిటీ సభ్యులుగా నాగేందర్‌రెడ్డి, సైదారావు, భాస్కరరావు, సుభాష్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.