
నిజమైన వారసులు కమ్యూనిస్టులే
చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేని సీసీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జంహంగీర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా చేపట్టిన బస్సు యాత్ర బుధవారం చౌటుప్పల్ మీదుగా సంస్థాన్‌నారాయణపురం మండలం గుడిమల్కాపురం చేరుకుంది. సాయుధ పోరాట యోధుడు మన్నె బక్కారెడ్డి స్తూపానికి నివాళులర్పించి వారోత్సవాలు ముగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తికోసం కమ్యూనిస్టులు వీరోచితమైన పోరాటం చేశారని పేర్కొన్నారు. సంబంధం లేని వ్యక్తులు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు చౌటుప్పల్‌లో మాజీ ఎంపీ ధర్మభిక్షం, చాకలి ఐలమ్మ విగ్రహాలకు నివాళుర్పించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, మాటూరి బాలరాజు, వెంకటేష్, బూరుగు కృష్ణారెడ్డి, గంగదేవి సైదులు, గోశిక కరుణాకర్, ఎండీ పాష, బండారు నర్సింహ, పల్లె మధుకృష్ణ, దశరథ, బొడ్డు అంజి రెడ్డి, కొండె శ్రీశైలం, జి.శ్రీనివాసచారి, దోడ యాదగిరిరెడ్డి, సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, దోనూరి నర్సిరెడ్డి, దొంతగోని పెద్దులు, తుమ్మల నర్సిరెడ్డి, లలిత, కృష్ణయ్య, వెంకటేశ్, సైదులు తదితరలు పాల్గొన్నారు.
ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్

నిజమైన వారసులు కమ్యూనిస్టులే