
అదే కొరత.. అదే వ్యథ
‘పోషణ్ భీ –పడాయి భీ’పై అవగాహన
రామన్నపేట: పోషణ్ భీ – పడాయి భీ కార్యక్రమంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు రామన్నపేటలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు హాజరై మాట్లాడారు. చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందజేయడంతో పాటు వారి చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా నవచేతన చిన్నారులు, డిజేబుల్ చిన్నారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం టీచర్లకు, ఆయాలకు యూనిఫామ్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటరమణ, ఏసీడీపీఓ సమీరా సూపర్‌వైజర్లు బాలమణి, ధనమ్మ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా విశ్వకర్మ జయంతి
భువనగిరిటౌన్ : విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, బీసీ సంక్షేమ అధికారి సాతీతి, విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
డ్రోన్ పరికరాల పరిశీలన
గుండాల: మండల కేంద్రంలోని ఎంజేఆర్ వ్యవసాయ క్షేత్రంలో తయారు చేస్తున్న డ్రోన్ పరికరాలను డీసీపీ అక్షాంశ్‌యాదవ్ బుధవారం పరిశీలించారు. ప్రభుత్వ అనుమతి మేరకే పరికరాలను తయారు చేస్తున్నారా, లేదా అని ఆరా తీశారు. ఆయన వెంట ఏసీపీలు శ్రీనివాస్‌నాయుడు, రాహుల్‌రెడ్డి, సీఐ శంకర్‌గౌడ్, ఎస్‌ఐ తేజమ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రతి విద్యార్థి పుట్టిన రోజు మొక్క నాటాలి
భువనగిరి: ప్రతి విద్యార్థి తన పుట్టిన రోజు తప్పనిసరిగా మొక్క నాటాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. బుధవారం భువనగిరి మండలం అనాజిపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ధరణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ మొక్కలను నాటడంతోనే సాధ్యమవుతుందన్నారు. అదే విధంగా ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి తమ తల్లి పేరున మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగవర్థన్‌రెడ్డి, ధరణి ఫౌండేషన్ చైర్మన్ లింగారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అదే కొరత.. అదే వ్యథ

అదే కొరత.. అదే వ్యథ

అదే కొరత.. అదే వ్యథ