
మహిళలకు మెరుగైన వైద్యసేవలు
భువనగిరి: మహిళల ఆరోగ్య పరిరక్షణ, మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వస్థ్‌నారి–సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం భువనగిరిలోని జనరల్ ఆస్పత్రిలో మహిళల మెడికల్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతి ఆరోగ్య కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్యసేవలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. మెడికల్ క్యాంపులలో ఎనిమది రకాల వైద్య పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులు ఇస్తారని, ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం స్వస్థ్ నారి–సశక్త్ పరివార్ ఆభియాన్ కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి, ఆస్పత్రి సూపరిండెంటెండ్ పాండునాయక్, వైస్‌ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌రావు, డీసీహెచ్‌ఎస్ చిన్ననాయక్, డిప్యూటీ సూపరిండెంటెండ్ సద్గుణాచారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి