
పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం ‘రావి’
భువనగిరి: రాజకీయ చైతన్యానికి, పో రాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం రావి నారాయణరెడ్డి అని ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లో మార్పులు రావాలని అవసరం ఉందన్నారు. భువన గిరి మండలం బొల్లేపల్లిలో రావి నారా యణరెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావి నారాయణరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ.. అప్పటి నాయకులు సేవాదృక్పథంతో పని చేసేవారని, ప్రస్తుత రాజకీయాల్లో దోరణి మారిందన్నారు. తొలి లోక్‌సభ ఎన్నికల్లో నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీ సాధించిన నాయకుడిగా రావి నారా యణరెడ్డి ఉండటం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టం అన్నారు.గాంధీజీతో కలిసి స్వాతంత్య్రం కోసం పనిచేశారని, ఆ తరువాత 1941లో ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించి నిజాం పాలనకు వ్యతిరేకంగా సాఽయుధ పోరు సాగించారని పేర్కొన్నారు. నల్లగొండ గడ్డ ఎంతో మంది మహానుభావులు పుట్టిన గడ్డ అని, అలాటి వారిలో రావినారాయణరెడ్డి ఒక్కరు అన్నారు. గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని, తన వంతుగా రూ.15 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రావి నారాయణరెడ్డి తన సొంత భూమి 500 ఎకరాలకు పేదలకు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కోరారు. భువనగిరితో పాటు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పై రావి నారాయణరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖబాబురావు, రావి నారాయణరెడ్డి సేవా సంస్థ అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సామ మధుసూదన్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఫ ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి