
పత్రికా స్వేచ్ఛపై కత్తికట్టిన ఏపీ ప్రభుత్వం
ప్రభుత్వాలు చేసే అవినీతి, అక్రమాలను ప్రతికలే వెలుగులోకి తెస్తాయి. ప్రభుత్వాలు మారగానే వ్యతిరేకంగా ఉన్న పత్రికలపై కక్షసాధింపు చర్యలు పెరుగుతున్నాయి. అబద్ధాలు రాస్తే కోర్టుల ద్వారా చర్యలు తీసుకోవాలి. పోలీస్ కేసులు బనాయించడం ఆనవాయితీగా మారింది. పత్రికల్లో ఏది వచ్చిన ఎడిటర్ స్థాయి వారిపై కేసులు పెట్టడం సరికాదు. పత్రిక స్వేచ్ఛను కాపాడాలి. సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం.
– కంచర్ల రామకష్ణారెడ్డి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం, నాయకులు సాక్షి పత్రికపై దాడి చేయడం సరైంది కాదు. ఏదైనా రాజకీయ పరమైన విబేధాలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ప్రతికా స్వేచ్ఛను హరించేలా పత్రికా ప్రతినిధులపై దాడి చేయడాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలి. సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయ్‌రెడ్డి, బ్యూరో ఇన్‌చార్జ్‌లు, స్థానిక రిపోర్టర్లపై దాడులు చేసి కేసులు బానాంయించడం సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు పత్రికలు, విలేకరులు కృషి చేస్తారు. అలాంటి వారిపై దాడులు చేయడం, కేసులు పెట్టడం ఏపీలోని కూటమి ప్రభుత్వానికి తగదు. – ఎండి జహంగీర్, సీపీఎం జిల్లా కార్యదర్శి

పత్రికా స్వేచ్ఛపై కత్తికట్టిన ఏపీ ప్రభుత్వం

పత్రికా స్వేచ్ఛపై కత్తికట్టిన ఏపీ ప్రభుత్వం