
నేడు ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమం
లక్ష్యం మేరకు ఒకే రోజు 10 వేల మొక్కలు నాటేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. పాఠశాలల ఆవరణ, ఇంటి పరిసరాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటనున్నారు. విద్యార్థులు మొక్కలు నాటే క్రమంలో ఫొటో తీసుకుని వెంటనే ఏకో క్లబ్స్ ఫర్ మిషన్ లైప్ ఫోర్టల్‌లో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థులకు మొక్కలు నాటినట్లుగా సర్టిఫికెట్ వస్తుంది.
భువనగిరి: భవిష్యత్ తరాలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆదివారం ఏక్ పేడ్ మాకే నామ్ (అమ్మపేరు మీద ఒక చెట్టు) కార్యక్రమానికి పూనుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో మొక్కలు నాటించనుంది. ఒకే రోజు 10 వేల మొక్కలు నాటించాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది.
45 వేల మంది విద్యార్థులు
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలకు చెందిన 6 నుంచి 12వ తరగతి వరకు 45 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థి వారి తల్లి పేరు మీద మొక్క నాటనున్నారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జూమ్ మీటింగ్ నిర్వహించి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. అవసరమైతే తల్లితో కలిసి విద్యార్థులు మొక్క నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను విద్యార్థులకు అందజేయనున్నారు.
ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా 6 నుంచి 12వ తరగతి వరకు ప్రతి విద్యార్థి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మొక్కలు నాటాలి. ఒకే రోజు లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. పాఠశాలల ఆవరణలు, ఇళ్ల పరిసరాల్లో మొక్కలు నాటవచ్చు. విద్యార్థులంతా మొక్కలు నాటేలా వారిని సంసిద్ధులను చేయాలని ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలకు సూచించాం. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడంతో పాటు విద్యార్థులకు చెట్ల ప్రాధాన్యత తెలుస్తుంది.
–సత్యనారాయణ, డీఈఓ
ఫ ప్రతి విద్యార్థి మొక్క నాటేలా కార్యాచరణ
ఫ లక్ష్యం 10 వేల మొక్కలు
ఫ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి

నేడు ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమం

నేడు ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమం