విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ఎంజీయూ ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. 12 మంది ఈఈఈ విద్యార్థులు రూ.3.50లక్షలతో 8 మంది ప్రయాణించే సోలార్ వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనానికి నాలుగు గంటలు చార్జింగ్ పెడితే 90 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అంతేకాకుండా సౌరశక్తితో చార్జింగ్ అయ్యేలా సోలార్ ప్యానెల్స్ బిగించారు. దాదాపు 8గంటల పాటు వాహనం ఎండలో ఉంటే.. బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీంతో పాటు అనేక నూతన ఆవిష్కరణలను ఎంజీయూ విద్యార్థులు చేపట్టారు.
నూతన ఆవిష్కరణలతో ప్రత్యేక గుర్తింపు