
రైతుల శవాలపై రోడ్డు నిర్మాణం చేస్తారా..
చౌటుప్పల్ : భూ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకోకుండా వారి శవాలపై రోడ్డు నిర్మాణం చేస్తారా.. అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్లూ చౌటుప్పల్‌లో ఆగారు. రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం అయ్యారు. అలైన్‌మెంట్ మార్పునకు కృషి చేయాలని భూనిర్వాసితులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. నిర్వాసితుల విషయంలో ఎందుకు సానుకూలంగా ఆలోచించడం లేదన్నారు. నిర్వాసితులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని, బేషజాలకు పోకుండా వారికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమావేశంలో భూ నిర్వాసితుల ఐక్యవేదిక కన్వీనర్ చింతల దామోదర్‌రెడ్డి, నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, పల్లె శేఖర్‌రెడ్డి, సుర్వి యాదయ్య, బచ్చనగోని గాలయ్య,గంగదేవి సైదులు, బోరెం ప్రకాష్‌రెడ్డి, సందగళ్ల మల్లేష్‌గౌడ్, బొమ్మిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, పల్లె పుష్పారెడ్డి, పల్లె మధుకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు