21 సంఘాలకు రూ.3.15 లక్షలు విడుదల | - | Sakshi
Sakshi News home page

21 సంఘాలకు రూ.3.15 లక్షలు విడుదల

Sep 14 2025 6:23 AM | Updated on Sep 14 2025 6:23 AM

21 సం

21 సంఘాలకు రూ.3.15 లక్షలు విడుదల

భువనగిరి: స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం రివాల్వింగ్‌ ఫండ్‌ విడుదల చేసింది. జిల్లాలో 14,848 సంఘాలు ఉండగా ఇందులో కొత్తగా ఏర్పాటైన 21 సంఘాలకు రూ.3,15,000 విడుదలయ్యాయి. ఒక్కో సంఘానికి రూ.15 వేల చొప్పున కేటా యించనున్నారు. ఈ నిధుల వినియోగాన్ని గ్రామీణాఽభివృద్ధి అధికారులు, జిల్లా, మండల, గ్రామ మహిళా సమాఖ్యలు పర్యవేక్షించనున్నాయి. ఈ నిధులను ఆయా సంఘాల్లోని సభ్యులకు రుణాల రూపంలో ఇవ్వనున్నారు.

మత్స్యగిరి క్షేత్రంలోకలెక్టర్‌ దంపతుల పూజలు

వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం కలెక్టర్‌ హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు ని ర్వహించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు, స్వామివారి ఫొటో బహూకరించారు.

నేడు, రేపు వర్ష సూచన

భువనగిరిటౌన్‌ : జిల్లాలోని పలు మండలాల్లో నేడు, రేపు (ఆది, సోమవారం) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షంతో పాటు 30 నుంచి40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. రామన్నపేటలో 56 మి.మీ, సంస్థాన్‌నారాయణపురంలో 46 మి.మీ, తుర్కపల్లి 41 మి.మీ, బీబీనగర్‌ 27 మి.మీ, మోటకొండూరు 25 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఆలేరు అభివృద్ధికి మరిన్నినిధులివ్వండి

యాదగిరిగుట్ట: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య శనివారం హైదరాబాద్‌లో కలిశారు. ఆలేరు నియోజకవర్గ సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సీఎంతో చర్చించారు. మరిన్ని నిధులిచ్చి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

ఎన్‌సీసీ అధికారికి

కెప్టెన్‌గా పదోన్నతి

ఆలేరు: ఆలేరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ అధికారి దూడల వెంకటేష్‌కు పదోన్నతి లభించింది.ఎన్‌సీసీ సెకండ్‌ (లెఫ్ట్‌నెంట్‌) ఆఫీసర్‌గా కొనసాగుతున్న ఆయనకు..ఫస్ట్‌ ఆఫీసర్‌(కెప్టెన్‌) గా పదోన్నతి కల్పిస్తూ ఎన్‌సీసీ డైరెక్టర్‌ జనరల్‌ ఆదేశాలు జారీ చేశారు. నాగపూర్‌లోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో శిక్షణ కోర్సు పూర్తి చేసిన నేపథ్యంలో ఆయనకు లెఫ్ట్‌నెంట్‌ నుంచి కెప్టెన్‌గా పదోన్నతి దక్కింది. శుక్రవారం వరంగల్‌ జిల్లా మామూనూరు పోలీసు శిక్షణ కేంద్రంలో జరిగిన పిప్పింగ్‌ సెర్మనీలో వెంకటేష్‌కు కల్నల్‌ రామదుౖరై, అడ్మిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ రవి సునారే ర్యాంకులు తొడిగి అభినందనలు తెలిపారు. పదవ తెలంగాణ బెటాలియన్‌ ఎన్‌సీసీ అధికా రులు ఆయనకు అభినందించారు.

21 సంఘాలకు రూ.3.15 లక్షలు విడుదల
1
1/2

21 సంఘాలకు రూ.3.15 లక్షలు విడుదల

21 సంఘాలకు రూ.3.15 లక్షలు విడుదల
2
2/2

21 సంఘాలకు రూ.3.15 లక్షలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement