
ఒక్క రోజే 36,182 కేసులు పరిష్కారం
భువనగిరిటౌన్ : జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శని వారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు కక్షిదారుల నుంచి భారీ స్పందన లభించింది. ఒక్క రోజే 36,182 కేసులు పరిష్కారం అయ్యాయి. భువనగిరి లో లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు జయరాజు ప్రారంభించారు. రాజీమార్గం ద్వారా ఒక్కటైన దంపతులను, రూ.22 కోట్ల భూమి కొనుగోలు వివాదా న్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్న ఇరువర్గాలను, వారి తరఫు న్యాయవాదులను అభినందించి అవార్డు కాపీలు అందజేశారు.
రాజీపడిన కేసులు
క్రిమినల్ 2,500, సివిల్ 14, ప్రిలిటిగేషన్, టెలిఫోన్ బకాయిలు, ఎస్‌బీఐ, టీజీ బ్యాంకుల కేసులు 76, ట్రాఫిక్ చలానాకు
సంబంధించి 33,592 కేసులు ఉన్నాయి.
రాజీయే రాజమార్గం
కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్‌లు ఎంతో దోహపడుతా యని జిల్లా ప్రధాన జడ్జి జయరాజు పేర్కొన్నారు. రాజీయే రాజ మార్గం అని, కక్షిదారులు చిన్నచిన్న కేసులను లోక్ అదాలత్‌లలో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, అదనపు జిల్లా జడ్జి ముక్తిదా, అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, పీపీలు, ఏపీపీఓలు సౌజన్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన
ఫ రాజీపడిన పలువురు కక్షిదారులకు అవార్డు కాపీలు అందజేత

ఒక్క రోజే 36,182 కేసులు పరిష్కారం