
గురుకులాల రిటైర్డ్ ఉద్యోగుల కమిటీ ఎన్నిక
సంస్థాన్ నారాయణ పురం: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కమిటీని ఆది వారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఆధ్యక్షుడిగా సర్వేల్ గురుకుల పాఠశాల మాజీ ప్రిన్సిపాల్ కేశిడి వెంకటనర్సయ్య, ఉపాధ్యక్షుడిగా డి.సంపత్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా కె.సుబ్బారావు, సంయుక్త కార్యదర్శిగా కె.రమాదేవి, కోశాధికారిగా వి. తిరుపతిరెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఎస్.వెంకటాచార్యులు, ఆర్.ఉపేందర్‌రెడ్డి, గౌరవ సలహాదారులుగా రవిచందర్, తిరందాస్ శ్యాంసుందర్‌ను ఎన్నుకున్నారు.
అమ్మపేరున మొక్క
భువనగిరి: ఏక్ పేడ్ మాకే నామ్(అమ్మ పేరు మీద ఒక చెట్టు) కార్యక్రమంలో భాగంగా అదివారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు తల్లులతో కలిసి మొక్కలు నాటారు. పాఠశాలలు, ఇంటి ఆవరణతో పాటు ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి ఫొటో తీసుకుని ఏకో క్లబ్ పోర్టల్‌లో ఆప్‌లోడ్ చేసి సర్టిఫికెట్‌లు పొందారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ఒకే రోజు 10 వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో 6 నుంచి 12 వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయ
జెండా ఎగురవేయాలి
భువనగిరిటౌన్ :
తెలంగాణ ప్రజలు ఈనెల 17వ తేదీన తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రజాచైతన్య వేదిక కన్వీనర్ కొమ్మిడి నర్సింహా రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం సిద్ధించిన రోజు అని, కొందరు నేతలు సెప్టెంబర్ 17ను తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. విద్రోహ దినమని కొందరు, విలీన దినమని మరికొందరు వాదిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 ప్రత్యేకమైన రోజని, స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న దినం అన్నారు. వాస్తవాలను నేటి పాలకులు గుర్తించాలని కోరారు. లేకుంటే తెలంగాణ పోరాట చరిత్రను అవమానించడమేనని కొమ్మిడి నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

గురుకులాల రిటైర్డ్ ఉద్యోగుల కమిటీ ఎన్నిక

గురుకులాల రిటైర్డ్ ఉద్యోగుల కమిటీ ఎన్నిక