ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు | - | Sakshi
Sakshi News home page

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు

Sep 15 2025 7:47 AM | Updated on Sep 15 2025 7:47 AM

ఏటా మ

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు

ఇంత వరద ఎన్నడూ లేదు ఏళ్లుగా సమస్య వెంటాడుతోంది

మోస్తరు వానొచ్చినా వణుకుతున్న ఆలేరు.. నాలాల కబ్జాతో ముందుకెళ్లని వరద నీరు

ఆక్రమణలు తొలగిస్తాం

ముంపు కాలనీ వాసుల కష్టాలను తొలగించడంపై దృష్టి సారించా. సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటా. ముఖ్యంగా నాలాల ఆక్రమణల వల్ల పలు కాలనీలు ముంపునకు గురవుతున్నట్లు గుర్తించాం.ఆక్రమణలను తొలగించడంతో పాటు వరదనీటి ప్రవాహానికి ఉన్న ఇతర అడ్డంకులనూ తొలగిస్తాం. సమస్యపై ఇప్పటికే అధికారులతో చర్చిస్తున్నా. నాలాకు సంబంధించి రైల్వేట్రాక్‌ కింద మూసుకు పోయిన మార్గాలను క్లియర్‌ చేయాలని ఆదేశించాను. – ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

ఆలేరు: మున్సిపాలిటీలోని పలు కాలనీలను ఏటా వరదలు ముంచెత్తుతున్నాయి. ఆ సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆక్రమణలు తొలగిస్తామని ప్రకటిస్తున్నారు. తర్వాత అటువైపు కన్నెత్తి చూడటానికి తీరిక ఉండటం లేదన్న విమర్శలు న్నాయి. పాత మున్సిపల్‌ కార్యాలయం, బ్రహ్మంగారి గుడి వద్ద నాలాలతో పాటు పెద్ద మోరి కబ్జాలతో కుంచించుకుపోయాయి. 40 అడుగులు ఉండాల్సిన పెద్దమోరీ 20 అడుగులే ఉండటం గమనార్హం. నాలాల పక్కల కొందరు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడం, మరికొందరు స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు చేయడంతో వరద ముందుకు వెళ్లడం లేదని, ఫలితంగా కాలనీలు ముంపునకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11వ తేదీ రాత్రి ముంపు ప్రాంతాల పరిశీలనకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో బాధితులు ఇదే విషయంపై ఫిర్యాదు చేశారు.

అన్నీ అడ్డంకులే..

ఆలేరు ప్రధాన రోడ్డు పక్కన ఉన్న పెద్దమోరి వద్ద వరద ప్రవాహం పూర్తిస్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. ఈ మోరీ వద్ద మిషన్‌భగీరథ పైప్‌లైన్‌ వరదకు అడ్డుపడుతుంది. ఇదే ప్రాంతంలోని రైల్వేట్రాక్‌ కిందినుంచి వరదనీరు వెళ్లడానికి నాలుగు మార్గాలు ఉండగా అందులో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. మరో రెండు చెత్త ఇరుక్కుపోవడం తదితర కారణాలతో మూసుకుపోవడం వల్ల వరద నీరు ముందుకు వెళ్లడానికి ఆటంక ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు.

కాలనీల్లోకి వస్తున్న బ్యాక్‌ వాటర్‌

ఎగువనున్న బైరవకుంట, పర్రెకాల్వ నిండితే దిగువన 11,12 వార్డుల పరిధిలోని కల్వర్టులు, నాలా మీదుగా వరద నీరు వెళుతుంది. కానీ.. నాలాల కబ్జా, కల్వర్టుల సమస్యతో నీరు సాఫీగా ముందుకు వెళ్లడం లేదు. దీనికి తోడు మట్టి దిబ్బలు అడ్డుగా ఉండటంతో వర్షపు నీరు తిరిగి వెనక్కి వెళుతోంది. ఫలితంగా రంగనాయకుల వీధి, కుమ్మరివాడ, పాత మున్సిపల్‌ కార్యాలయం ఏరియా, బ్రహ్మంగారి గుడి, ఈదమ్మగుడి వరకు ముంపునకు గురవుతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడుతున్నారు. సరుకులు, దుస్తులు తడిసి చీకట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గ డిపే పరిస్థితులు ఏటా అనివార్యంగా మారాయి.

ఎన్నడూ లేనంతగా ఈసారి వరద పోటెత్తింది. నాలాలు పొంగి మా కాలనీ ముంపునకు గురైంది. ఇళ్లలోకి మోకాలు లోతు నీళ్లు చేరాయి. రేషన్‌ సరుకులు, దుస్తులు తడిసిపోయాయి. నీళ్లలోనే పిల్లలు, వృద్ధులతో చీకట్లో భయంభయంగా గడిపాం. ఏటా వానాకాలం ముంపు సమస్యతో నరకం అనుభవిస్తున్నాయి. నాలాల కబ్జాల వల్లే వరద నీరు ముందుకెళ్లకుండా ఇళ్లలోకి వస్తుంది.

– బండారు వెంకటయ్య, రంగనాయకుల వీధి

కొన్నేళ్లుగా ముంపు సమస్యతో బాధపడుతున్నాం. వర్షం పడితే భయమేస్తుంది. ప్రతి సారి వరద పోటెత్తి కాలనీ ముంపునకు గురై, ఇళ్లలోకి నీరు చేరుతుంది.వర్షం తగ్గే వరకు భయంగా భయంగా గడపాల్సిన పరిస్థితి. నాలాల ఆక్రమణలే ముంపు సమస్యకు కారణం. అధికారులు లా దిశగా చర్యలు తీసుకోవాలి.

– బాలరాజు, పాత మున్సిపల్‌ ఆఫీస్‌ రోడ్డు

ఆక్రమణలు.. అధికారుల నిర్లక్ష్యం.. సామాన్యులకు శాపంగా మారుతోంది. కబ్జాలతో నాలాలు కుంచించుకుపోవడంతో ఏటా వానాకాలం కాలనీలను వరద ముంచెత్తుతోంది. ప్రజలు నరకయాతన పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు కంటితుడుపు చర్యలతోనే సరిపెడుతున్నారు. ఇకనైనా ముంపు ప్రాంతాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

బైరవకుంట, పర్రెకాల్వ

బ్యాక్‌ వాటర్‌తోనూ ఇక్కట్లు

పలు కాలనీలు జలమయం

ఏటా ఇదే దురవస్థ.. కానరాని ప్రణాళిక

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు1
1/8

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు2
2/8

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు3
3/8

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు4
4/8

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు5
5/8

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు6
6/8

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు7
7/8

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు8
8/8

ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement