
రోడ్లకు మరమ్మతులు చేయించండి
భువనగిరి: జగదేవ్‌పూర్ రోడ్డు, రైల్వే బ్రిడ్జిపై గుంతలకు తక్షణమే మరమ్మతులు చేయించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బీఆర్‌ఎస్ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో భువనగిరిలోని జగదేవ్‌పూర్ రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మోకాలు లోతు గుంతలు ఏర్పడి రహదారులు అధ్వానంగా మారాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు దెబ్బతింటున్నాయన్నారు. పట్టణ రోడ్లపై జరిగిన ప్రమాదాల్లో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారని వాపోయారు. ఎమ్మెల్యే, అధికారులు మొద్దునిద్ర వీడి ధ్వంసమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. పోలీసులు నచ్చజెప్పినా ధర్నా విరమించకపోవడంతో వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన అంజనేయులు, పార్టీ పట్టణ, మండల కమిటీ అధ్యక్షచ కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఖాజా అజీమోద్దీన్, నాయకులు ఇట్టబోయిన గోపాల్, కుశంగుల రాజు, తాడూరి భిక్షపతి, తాడెం రాజశేఖర్, వెల్దుర్తి రఘునందన్, బర్ల రమేష్, ఇక్బాల్ చౌదరి, ఇస్మాయిల్, మల్లయ్య, లక్ష్మీనారాయణ, ర్యాకల శ్రీనివాస్, మహేందర్‌రెడ్డి, కృష్ణ, కిష్టయ్య, పద్మ, సుభాష్,నర్సింగ్‌రావు, శ్రీనివాస్,మధు తదితరులు పాల్గొన్నారు.