
ఎంజీ యూనివర్సిటీలో కబడ్డీ పోటీలు
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మంగళవారం యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో అంతర్ కళాశాల కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళల విభాగంలో సోషల్ వెల్ఫేర్ ఆర్మీ డిగ్రీ కళాశాల, భువనగిరి విద్యార్థినులు మొదటి స్థానంలో నిలువగా.. పురుషుల విభాగంలో కేఆర్ డిగ్రీ కళాశాల, మిర్యాలగూడ విద్యార్థులు విజయం సాధించారు. అదేవిధంగా మహిళల విభాగంలో రన్నరప్‌గా సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల, నల్లగొండ, పురుషుల విభాగంలో రన్నరప్‌గా ఎన్జీ కళాశాల, నల్లగొండ విద్యార్థులు నిలిచారు. గెలుపొందిన జట్లకు యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ హరీష్‌కుమార్, జి. ఉపేందర్‌రెడ్డి, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ వై. ప్రశాంతి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మురళి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.