
స్నేహం ఊహకు అందని అంశం
స్నేహం అనేది ఊహకు అందని అంశం. మధురమైన జ్ఞాపకం. స్నేహానికి గుర్తే ఫ్రెండ్‌షిప్‌డే. ప్రస్తుత రోజుల్లో మానవ విలువలు, సంబంధాలు వ్యాపారమయంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ఫ్రెండ్‌షిప్‌డే గొప్పతనాన్ని చాటిచెప్పాలి. ఏ స్థాయిలో ఉన్నా తన స్నేహాన్ని మర్చిపోకుండా అక్కున చేర్చుకోవడమే నిజమైన స్నేహం. నా చిన్ననాటి స్నేహితుడు నల్లబెల్లి యాదగిరిది మోత్కూర్ మండలం గట్టు సింగారం. మా స్వగ్రామమైన శాలిగౌరారం మండలం ఊట్కూరు వాసి అనిల్ కూడా నా స్నేహితుడే. ఇంటర్‌లో న్యాయవాది ధర్మార్జున్‌తో కూడా స్నేహం చేశాను. ఆయన కూడా నాకు అండగా ఉండేవాడు.
– వేముల వీరేశం,
ఎమ్మెల్యే నకిరేకల్